Breaking News

కారణాలు చెప్పే అరెస్టు చేశాం

Published on Sat, 03/16/2024 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ కీలక నేత, ఎమ్మెల్సీ కవిత ఇంట్లో తనిఖీలు ప్రశాంతంగా సాగాయని, ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రకటించారు. శుక్రవారం కవిత నివాసంలో తనిఖీలు ముగిశాక పంచనామా నివేదికను విడుదల చేశారు. ఆ వివరాలు ‘‘పంచ్‌లు (వీరి సమక్షంలో అధికారులు విచారణ చేస్తారు) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ మేనేజర్‌ పి.శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ మేనేజర్‌ ఏద్దుల వివేకానందకుమార్‌రెడ్డి ఎదుట వివరాలు సేకరించాం. ఈడీ అదనపు డైరెక్టర్‌ కపిల్‌రాజ్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కవిత నివాసంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించాం.

మొదట తనిఖీల అధికారిక పత్రంపై కవిత సంతకాన్ని తేదీతో సహా తీసుకున్నాం. తర్వాత అదే పత్రంపై మేం కూడా తేదీతో సహా సంతకం చేశాం. మధ్యాహ్నం 1.45 గంటలకు తనిఖీలు ప్రారంభించాం. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)–2002లోని సెక్షన్‌ 17 ప్రకారం కవిత వాంగ్మూలాన్ని నమోదు చేశాం. సెక్షన్‌ 19 ప్రకారం సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్టు చేశాం. ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నామో కారణాలను ఆమెకు వివరించాం. పలు రికార్డులు/ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు 5 ఫోన్ల సీజ్‌ చేశాం. సాయంత్రం 4.15 గంటలకు అధికారి మమత నారా వెళ్లడంతో మరో అధికారి వరలక్ష్మి వచ్చి పాల్గొన్నారు.

సుమారు సాయంత్రం 6 గంటల సమయంలో కవిత సోదరుడు, మరికొందరు వ్యక్తులు, న్యాయవాదులు చట్టవిరుద్ధంగా తనిఖీల ప్రాంతంలోకి వచ్చారు. వారెవరో మాకు వివరాలు చెప్పలేదు. విచారణకు ఆటంకం కలిగించారు. సాయంత్రం 6.45 గంటలకు తనిఖీలు ముగించాం. ప్రశాంతంగా, ఇంట్లోని ఏ వస్తువులకూ ఎలాంటి నష్టం కలగకుండా కొనసాగించాం. ప్రారంభంలో తనిఖీలను కవిత సున్నితంగా తిరస్కరించారు’’అని పంచనామాలో ఈడీ అధికారులు వివరించారు. ఈ తనిఖీల్లో ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగేందర్‌తోపాటు డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌గోయల్, అధికారులు విక్రాంత్‌కుమార్, కార్తీక్‌ మెహ్రా, హిమాన్షు చౌదరి, మమతా నారా, బ్రజేష్‌ చౌరాసియా పాల్గొన్నట్టు తెలిపారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)