Breaking News

కారు రేసు కేసులో ట్విస్ట్‌.. ఈడీ విచారణకు బీఎల్‌ఎన్‌ రెడ్డి డుమ్మా

Published on Thu, 01/02/2025 - 08:51

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నేడు ఈడీ విచారణకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు.

ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ అధికారులు నేడు విచారించాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్‌ పంపారు. దీంతో, బీఎల్‌ఎన్‌ రెడ్డి మెయిల్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్‌ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్‌.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్‌-ఏ1, ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌-ఏ2, బీఎల్‌ఎన్‌ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్‌ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్‌ఈవోకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది.

 

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి