Breaking News

TS: 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్‌?

Published on Tue, 10/03/2023 - 10:05

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు  నేటి(మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల బృందం హైదరాబాద్‌లో వరుస భేటీలు జరపనుంది. వివిధ రాజకీయ పార్టీలతో.. ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధత తదితర అంశాలపై సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. 

ఓ ప్రముఖ హోటల్‌లో మంగళవారం మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం అవ్వనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో సమీక్షించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారులు ప్రెజెంటేషన్  ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, మోడల్‌ కోడ్‌తో పాటు డబ్బు, ఉచిత పంపిణీలు, మద్యం సరఫరా సహాపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇక  4వ  తేది ఉదయం 6.30 గంటలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై సైక్లోథాన్, వాక్ థాన్ నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచిసాయంత్రం 7 వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో ఎన్నికల బృందం సమావేశమవ్వనుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు టెక్ మహీంద్రలో స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ అవ్వనుంది. 11 గంటలకు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అలాగే మధ్యాహ్నాం 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్, ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల బృందం ఆరా తీయనుంది.

గత ఎన్నికల సమయంలో.. అక్టోబర్‌ నెలలోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. ఈసారి కూడా అక్టోబర్‌ 6 లేదా 7వ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  


చదవండి: తెలంగాణలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)