Breaking News

హైడ్రాపై హైరానా వద్దు.. హైదరాబాద్ అంటేనే రాక్స్, లెక్స్: భట్టి

Published on Mon, 10/07/2024 - 15:32

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్‌ చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.

చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్‌లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.

మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్‌టీఎల్‌ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: జీహెచ్‌ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్‌ ఫైర్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)