Breaking News

తెరపైకి మళ్లీ డబుల్‌ డెక్కర్‌ రైళ్లు

Published on Sun, 09/10/2023 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: వందేభారత్‌ రైళ్లు సూపర్‌ సక్సెస్‌ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్‌ డెక్కర్‌ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్‌ డెక్కర్‌ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది.  

బెర్తులు ప్రవేశపెట్టి..
డబుల్‌ డెక్కర్‌ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్‌ కార్‌ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నడిచే సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లలో ప్రయాణి­కులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారి­కి పగటి సమయం వృథా కావటం లేదు.

కానీ, డబుల్‌ డెక్కర్‌ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్‌ డెక్కర్‌ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్‌–తిరుపతి, సికింద్రాబాద్‌–విశాఖపట్నం మధ్య ప్రవేశపె­ట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు  పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యు­పెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతా­నికి చేరింది.

దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్‌ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగు­పెడుతున్నా కిక్కిరిసిపోతు­న్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమ­యంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభా­రత్‌ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్‌ డెక్క­ర్‌ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. 

ప్రయాణికులతోపాటు సరుకులు కూడా..
ఇక పైడెక్‌లో ప్రయా­ణి­కులు, దిగువ డెక్‌లో సరు­కు­లను ఏకకాలంలో తర­లించే ప్యాసింజర్‌ కమ్‌ గూడ్స్‌ నమూ­నాలో కూడా డబుల్‌ డెక్కర్‌ రైళ్లను ప్రవేశ­పెట్టాలని రైల్వే భావిస్తోందని సమా­చారం. దీనికి సంబంధించి డిజైన్‌లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్‌డీఎస్‌ఓ పరిశీ­లిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్‌ డెక్కర్‌ రైళ్లకు మళ్లీ డిమాండ్‌ కల్పించాలని రైల్వే భావిస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)