Breaking News

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం

Published on Thu, 10/03/2024 - 12:45

సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది.

సెప్టెంబర్‌ 9న ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించింది. బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పెండింగ్‌ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని స్పీకర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. అనర్హత వేటుకు సంబంధించిన అంశాల్లో వాదనలు వినాలి. అలాగే షెడ్యూల్‌ ఖరారు చేయాలి. వీటన్నింటికి సంబంధించిన స్టేటస్‌ రిపోర్ట్‌ను హైకోర్టుకు సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం. 

నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని, స్టేటస్‌ రిపోర్ట్‌ను తమకు అందజేయాలని తీర్పిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగియనుంది.  ఈ తరుణంలో రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపైన స్టే విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో అడ్వకేట్‌ జనరల్‌ ఈ అంశంపై స్టే విధించి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

అయితే దీనిపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మాత్రం అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ కార్యదర్శి తరుఫున కోర్టులో వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ చెప్పే విషయాలన్నింటిని తాము వినేందుకు సిద్ధంగా ఉన్నామని,  ఈ నెల 24న వాదనలు వింటామని సూచించింది. 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)