Breaking News

అట్లూరి ప్రసన్న.. రూ.100 కోట్ల స్కాంలో నిందితురాలు

Published on Thu, 07/09/2026 - 07:39

సాక్షి, హైదరాబాద్‌: షేర్స్‌ బజార్‌ ప్రై.లి.(ఎస్‌బీపీఎల్‌), కిసాన్‌ పరివార్‌ (కేపీఎల్‌) కంపెనీల పేరిట రూ.100 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ కంపెనీ డైరెక్టర్, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌ అట్లూరి ప్రసన్న (25) అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ప్రసన్న న్యూయార్క్‌లోని షుయ్లర్‌ కౌంటీలో ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు రెడ్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రసన్న.. సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగంలో గత నెల 15న నమోదైన చీటింగ్‌ కేసులో నిందితురాలు.

అల్గారిథమ్‌ ఆధారిత స్టాక్‌ ట్రేడింగ్, సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు అందిస్తామని పెట్టుబడిదారులను ఆకర్షించి.. రూ.వందల కోట్లు మోసగించారు. పెట్టుబడిదారులకు ఏడాదికి 18 నుంచి 48 శాతం వరకు అధిక లాభాలు అందిస్తామని నమ్మించిన ఈ సంస్థలు దేశవ్యాప్తంగా దాదాపు 6 వేల మందిని మోసగించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 1,500 మంది బాధితులు ఉన్నారు. గత జూన్‌ 15న సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగంలో కేసు నమోదైంది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)