Breaking News

మూడేళ్లలో ఆరుగురు దుర్మరణం

Published on Tue, 02/24/2026 - 12:44

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌–1లోని జలగం వెంగళరావు పార్కు మలుపు మృత్యువుకు పిలుపుగా మారింది. రోజూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అటు జీహెచ్‌ఎంసీ ఇటు ట్రాఫిక్‌ పోలీసుల్లో చలనం కరువైంది. రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఆ దిశగా ముందడుగు పడడం లేదు. రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ వాహనదారులు, పాదచారులను మృత్యువు కాటేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. 

  • మూడేళ్లలో ఈ రోడ్డులో వెంగళరావు పార్కు మలుపు వద్ద 46 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నారు.  

  • ఇప్పటివరకు ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. వాహనాలు నుజ్జునుజ్జయి పోలీస్‌స్టేషన్ల ఆవరణలో తప్పుపట్టిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్లు వేయడంలోగానీ, ఈ మలుపులో ప్రమాదం పొంచి ఉందన్న జాగ్రత్తలను సూచించడంలోగానీ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రోడ్డు ప్రమాదాలు జరగగానే అటు పంజగుట్ట పోలీసులు, ఇటు బంజారాహిల్స్‌ పోలీసులు ఆ రోజు హడావుడి చేసి కేసులు నమోదు చేసి చేతుల దులుపుకొంటున్నారు. శాశ్వత ప్రాతిపదికన సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

  • నిమ్స్‌ ఆస్పత్రి వైపు నుంచి ఎఫ్‌సీఎల్‌ చౌరస్తాకు వెళ్లే ఈ మలుపు వద్దనే ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నా తీసుకోవాల్సిన చర్యలపై మాత్రం పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.

  • ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే..
    జలగం వెంగళరావు పార్కు ప్రారంభమైన చోట ఫుట్‌పాత్‌ను కొంత తగ్గించి రోడ్డును విస్తరించాలి.
  •  ఫుట్‌పాత్‌పై ఆక్రమణలు తొలగించి పాదచారులు రోడ్డెక్కకుండా చూడాలి. 
  •  ఈ మలుపు వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 
  •  ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. 
  •  అడ్డుగా ఉన్న భారీ చెట్లను తొలగించాలి. 
  • రోడ్డు విస్తరణపై, ప్రమాదాలకు గల కారణాలపై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేసి పటిష్టమైన ప్రణాళికలు రూపొందించాలి. 
  • రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ఈ పరిధి మాది కాదంటే మాది కాదంటూ పోలీసులు చేతులెత్తేయకుండా వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. 

చ‌ద‌వండి: వెంటాడిన విధి.. దూసుకొచ్చిన మృత్యువు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)