Breaking News

RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి

Published on Thu, 09/07/2023 - 07:48

సాక్షి, శంషాబాద్‌: కస్టమ్స్‌ తనిఖీలు తప్పించు­కుని బంగారాన్ని బయటికి తరలించేందు­కు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయి­స్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బ­యటికి తీసుకురాకుండా, ఎయిర్‌­పోర్టు ఉద్యోగు­లతో బయ­టికి తరలిస్తున్న సంఘటనలు బయట­పడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్‌ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు.

అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్‌ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్‌ చేశారు.

933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్‌ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)