Breaking News

టీ హబ్‌లో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌

Published on Thu, 02/01/2024 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ జనరల్, బెంగళూరు కాన్సుల్‌ జనరల్‌ థెయిరి బెర్తెలోట్‌ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు కాన్సుల్‌ జనరల్‌ బెర్తెలోట్‌కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్‌ మ్యాన్‌ పవర్‌ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ హైదరాబాద్‌ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్‌లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్‌ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్‌ ఇండియా అంబాసిడర్‌ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్‌ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్‌ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ కూడా ఉన్నారు. 

త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్‌ సంస్థల ఏర్పాటు 
ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్‌ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్‌ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్‌ ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు.

త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మమతా లంబ మంత్రి శ్రీధర్‌బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్‌ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్‌ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్‌ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)