Breaking News

జీహెచ్‌ఎంసీ ఆఫీసులోకి కాంగ్రెస్‌ నేతలు.. లోపల కూర్చుని నిరసన

Published on Fri, 07/28/2023 - 09:48

Updates..

► జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు. ఆఫీసు లోపల బైఠాయించి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వినతి పత్రం ఇస్తే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ అమర్యాదగా ప్రవర్తించారంటూ నిరసనలు తెలిపారు. 

► జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీసు వద్దకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. 

►  జీహెచ్‌ఎంసీ ఆఫీసు ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. 

►  దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

►  ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైంది. మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. జీహెచ్‌ఎంసీ గేట్లు ఎక్కే ప్రయత్నం చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల రికార్ఢు స్థాయిలో వర్షం కురువడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఇటు, భారీ వరదల కారణంగా చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా, కొంతమంది మృత్యువాతపడ్డారు. మరోవైపు.. హైదరాబాద్‌లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

ఈ నేపథ్యంలో వర్షాలపై అప్రమత్తం కానందుకు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. వరద బాధితులకు రూ.10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో, తెలంగాణ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే జీహెచ్‌ఎంసీ ఎదుట భారీగా మోహరించారు. జీహెచ్ఎంసీకి ఉన్న మూడు గేట్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.  

ఇది  కూడా చదవండి: గోదావరి ఉగ్రరూపం.. అధికారులు అలర్ట్‌

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)