Breaking News

ఎంఐఎంతో మన వైఖరి ఏంటి?

Published on Fri, 05/30/2025 - 01:23

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం విషయంలో పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. ఎన్నికల సమయంలో తాము ఎంఐఎంతో ప్రాణాలకు తెగించి కొట్లాడతామని, ఎన్నికలయ్యాక కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆ పార్టీతో దోస్తానా చేస్తారని, ఇలాగైతే హైదరాబాదులో పార్టీ ఎలా అభివృద్ధి అవుతుందని వారు ప్రశ్నించారు. ఎంఐఎం విషయంలో ఒక వైఖరి తీసుకుని ముందుకెళ్తే తాము కూడా రాజకీయంగా ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని స్పష్టం చేశారు. 

పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అవుతున్న మీనాక్షి నటరాజన్‌ రెండో రోజు గురువారం మహబూబ్‌నగర్, చేవెళ్ల, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ నేతలు ఎంఐఎం అంశాన్ని ఆమె వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది.   

జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు.  
’హైదరాబాద్‌ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కు లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఒక నాయకుడికి కూడా నామినేటెడ్‌ పదవి ఇవ్వలేదు. ఎంఐఎంతో కొట్లాడినప్పుడు మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు ఎత్తేయాలని కోరినా పట్టించుకునే నాథుడు లేడు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మమ్మల్ని కలవరు. సీఎం అపాయింట్‌మెంట్‌ అడిగితే ఇవ్వరు’ అని మీనాక్షి నటరాజన్‌ వద్ద హైదరాబాద్‌ నేతలు మొరపెట్టుకున్నట్టు తెలిసింది. 

వారి విజ్ఞాపనలు విన్న మీనాక్షి అన్ని అంశాలు పార్టీతో మాట్లాడతానని, హైదరాబాద్‌ జిల్లాలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్దామని చెప్పినట్లు తెలిసింది. చేవెళ్ల, మహబూబ్‌గర్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు కూడా మీనాక్షితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత గురించి వారితో మాట్లాడినట్టు తెలిసింది. 

పాలమూరు లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మంత్రులు తమ నియోజకవర్గాలకు అధిక నిధులు తీసుకెళ్తున్నారని, దీనివల్ల తమకు నష్టం జరుగుతోందని, మంత్రులతో సమానంగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల కూడా నిధులిచ్చేలా చూడాలని మీనాక్షిని కోరినట్లు తెలిసింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)