Breaking News

బ్యాంకును మోసగించిన కేసులో కాంగ్రెస్‌ నేత అరెస్టు

Published on Wed, 07/31/2024 - 07:19

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంక్‌ ఖాతాదారునికి తెలియకుండా రూ.40 కోట్లు కాజేసిన కేసులో ఇద్దరు బ్యాంక్‌ మేనేజర్లతో సహా కాంగ్రెస్‌ నాయకుడు షేక్‌ బషీద్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బషీద్‌ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తరుఫున రాజంపేట ఎంపీ అభ్యరి్థగా పోటీ చేశాడని సైబరాబాద్‌ ఆరి్థక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) డీసీపీ కె.ప్రసాద్‌ తెలిపారు. కేసు పూర్తి వివరాలివీ..ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థకు ఖాతా ఉంది. 

బ్యాంక్‌ అంతర్గత ఆడిట్‌లో భాగంగా జులై 12న ఈ ఖాతా నుంచి శంషాబాద్‌లోని ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు రూ.15 కోట్లు, రూ.25 కోట్లు చొప్పున రెండు విడతల్లో రూ.40 కోట్ల నగదు బదిలీ అయినట్లు బ్యాంక్‌ అధికారులు గుర్తించారు. ముంబైలోని ప్రధాన కార్యాలయం అనుమతి లేకుండా అనధికారికంగా ఈ నగదు బదిలీ జరిగినట్లు తేలడంతో జోనల్‌ హెడ్‌ను అప్రమత్తం చేశారు. దీంతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జోనల్‌ హెడ్‌ (ఆపరేషన్స్‌) మణికందన్‌ రామనాథన్‌ జులై 19న సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బహుమతిగా ఫార్చ్యూనర్‌ కార్లు.. 
కొట్టేసిన సొమ్ముతో బషీద్‌ రెండు టయోటా ఫార చ్యనర్‌ కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో ఒకటి బ్యాంక్‌ మేనేజర్‌ రామస్వామికి బహుమతిగా అందించాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో బషీద్‌ ఢిల్లీకి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితులు రామస్వామి, రాజే‹Ùలను హైదరాబాద్‌లో, బషీద్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. వీరిని జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో అరెస్టయిన ఏ–3 బషీద్‌పై గతంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, బోయిన్‌పల్లి పీఎస్‌లతో పాటు సైబరాబాద్‌లోని నార్సింగి, వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట్‌ ఠాణాలలో పదికి పైగా చీటింగ్‌ కేసులున్నాయి. బషీద్‌ పలు సినిమాలను నిరి్మంచడంతో పాటు నటించాడు కూడా.

బ్యాంక్‌ మేనేజర్ల పనే.. 
శంషాబాద్‌లోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కనుగుల రామస్వామి, సర్వీస్‌ డెలివరీ మేనేజర్‌ సపాయి రాజేశ్‌ ఈ వ్యవహారంలో కీలక సూత్రధారులు. ఆదిత్యా బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఖాతాలో రూ.కోట్లలో జరుగుతున్న లావాదేవీలను గుర్తించిన ఇరువురు నిందితులు పక్కా పథకం వేశారు. జులై నెలలో జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి షేక్‌ బషీద్‌ పేరుతో బ్యాంక్‌ అకౌంట్‌ను తెరిచారు. ఈ ఖాతాకు ఆదిత్య బిర్లా హౌసింగ్‌ ఫైనాన్స్‌ చెక్, ఆరీ్టజీఎస్‌ లేకుండా అనధికారికంగా రూ.40 కోట్ల నగదును బదిలీ చేశారు. క్షణాల్లోనే ఈ అకౌంట్‌ నుంచి జాతీయ, ప్రైవేట్‌ బ్యాంక్‌ల్లోని 20 వేర్వేరు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ సొమ్ములో కొంత మొత్తాన్ని వేర్వేరు ఏటీఎంల నుంచి విత్‌ డ్రా చేశారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)