Breaking News

రెండు గ్యారంటీల ప్రారంభం సచివాలయంలోనే!

Published on Tue, 02/27/2024 - 05:24

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సర్కారు తలపెట్టిన మరో రెండు గ్యారంటీ హామీల ప్రారంభోత్సవ వేదిక మారింది. ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనుంది. నిజానికి మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉంది.

కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్‌ విడుదలవడం, వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభ కోసం టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)