Breaking News

కాంగ్రెస్‌ తెలంగాణ పోరు ‘యాత్ర’

Published on Tue, 02/28/2023 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మరో యాత్రకు సిద్ధమవుతోంది. మార్పు కోసం పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ యాత్ర ఓ వైపు కొనసాగిస్తుండగా, మరోవైపు నుంచి ఇంకో యాత్ర ప్రారంభించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో వెల్లడించారు.

మహేశ్వర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి మూడో తేదీ నుంచి ‘కాంగ్రెస్‌ తెలం­గాణ పోరు యాత్ర’ పేరుతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. బాసర సరస్వతీ దేవాలయంలో ప్రత్యేక పూజ­లు నిర్వహించిన తర్వాత భైంసా వరకు తొలి రోజు యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత నిర్మల్, ఖానా­పూర్, ఉట్నూర్, ఆదిలాబాద్, ఇచ్ఛోడ మీదుగా బోథ్‌ వరకు తొమ్మిదో తేదీవరకు యాత్ర నిర్వహిస్తారు.

మధ్యలో మార్చి 7వ తేదీన హోలీ సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించనున్నారు. తొమ్మి­దో తేదీన బోథ్‌ వరకు తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత రెండో విడత షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. మొత్తం మీద బాసర నుంచి హైదరాబా­ద్‌ వరకు యాత్రను పూర్తి చేసి, ముగింపు కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించేలా యాత్ర షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.  ప్రతి నియోజకవర్గంలో 1,2 రోజుల పాటు యాత్ర కొనసాగేలా షెడ్యూల్‌ తయారు చేశామని,  అధిష్టానం ఆదేశాల మేరకే ఈ యాత్ర జరుగుతోందని, యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలందరూ పాల్గొంటారని మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)