Breaking News

మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ.. కాన్వాయ్ ​అడ్డగింత

Published on Tue, 05/02/2023 - 16:53

సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో మంత్రి కాన్వాయ్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో పర్యటించేందుకువచ్చిన కేటీఆర్‌ వాహనాన్ని కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదే విధంగా కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్​చేశారు. కాగా రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా  కురుస్తున్న అకాల వర్షాలతో  అనేకచోట్ల చేతికొచ్చిన  పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే.  భారీ వర్షాలు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో దెబ్బతిన్న పంట పొలాలను  మంత్రి కేటీఆర్ పరిశీలించారు.  

రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని  భరోసా ఇచ్చారు.  రైతులు అధైర్యపడొద్దని, కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. 
చదవండి: సెక్రటేరియట్‌ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్‌భవన్‌ క్లారిటీ..

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)