Breaking News

కబ్జాదారులకు సీఎం రేవంత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Wed, 09/11/2024 - 11:41

సాక్షి,హైదరాబాద్‌: దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేసిన వాళ్లు స్వచ్ఛంధంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే తమ హైడ్రా వాటిని మొత్తం నేలమట్టం చేస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. ఆక్రమణదారులు ఎంత పెద్దవాళ్లైనా వదిలేది లేదని హెచ్చరించారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో బుధవారం(సెప్టెంబర్‌11) జరిగిన ఎస్సైల పాసింగ్‌అవుట్‌ పరేడ్‌లో సీఎం పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్‌ చేసే స్కీమ్‌ ఏమీ లేదు.  ఫాంహౌసుల్లోని డ్రైనేజీ నీటిని ఉస్మాన్‌సాగర్‌,హిమాయత్‌సాగర్‌లలో కలుపుతున్నారు’అని చెప్పారు. 

‘పోలీసు జాబ్‌ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా పోలీసులదే కీలక బాధ్యత. మా ప్రభుత్వం 30 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చింది. మరో 35వేలకుపైగా ఉద్యోగాలు ఈ ఏడాది చివరికల్లా ఇస్తాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహిస్తున్న పరీక్షలపై ఎవరికీ అనుమానాలు లేవు. కేవలం 8 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశాం. దుర్మార్గులు చెరువులను ఆక్రమించడం వల్లే వరదలు వస్తున్నాయి. డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు’అని సీఎం అన్నారు. 

చెరువుల ఆక్రమణలతోనే వరదలు: సీఎం రేవంత్

ఇదీ చదవండి.. ఫ్యూచర్‌సిటీపై ఆచితూచి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)