ఢిల్లీకి సీఎం రేవంత్‌

Published on Thu, 12/11/2025 - 02:45

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: సీఎం రేవంత్‌రెడ్డి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈసారి పర్యటనలో ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాందీని కలుస్తారని సీఎంవో వర్గాల ద్వారా తెలిసింది. గ్లోబల్‌ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ హాజరు కాని నేపథ్యంలో, సమ్మిట్‌ జరిగిన తీరు గురించి సీఎం ఆయనకు వివరిస్తారని సమాచారం. 

గురువారం పార్లమెంటుకు వెళ్లి వీలును బట్టి కొందరు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలుస్తోంది. సోనియా గాందీని కలిసి జన్మదిన శుభాకాంక్షలుతెలియజేస్తారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్‌తో సమావేశమై పార్టీ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకాలు, కార్పొరేషన్‌ పదవుల భర్తీ లాంటి అంశాలపై చర్చించే అవకాశముందని సమాచారం.  

శరద్‌ పవార్‌ విందులో రేవంత్, రాహుల్‌ భేటీ 
ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో జరిగిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 12న శరద్‌ పవార్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాందీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరయ్యారు. 

ఢిల్లీ వచ్చిన సీఎం రేవంత్‌ తోపాటు,  మధుయాష్కీ గౌడ్‌ ఈ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరద్‌ పవార్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు..కాసేపు ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.  

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)