Breaking News

ఫామ్‌హౌస్‌లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్‌

Published on Sat, 10/05/2024 - 14:39

సాక్షి, హైదరాబాద్‌: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.

వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ పూర్తిగా కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్‌ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్‌, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు 

..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్‌పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. 

ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు..  నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు.

 

 

ఇది కూడా చదవండి: ‘జీహెచ్‌ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)