Breaking News

‘గ్లోబల్‌’ స్థాయిలో ఏర్పాట్లు

Published on Sun, 12/07/2025 - 10:17

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, రంగారెడ్డిజిల్లా: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ.. తెలంగాణ విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సమ్మిట్‌ జరగనున్న ప్రాంగణాన్ని శనివారం సాయంత్రం ఆయన తొలుత హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. 

అనంతరం ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన అన్ని హాళ్లను చూశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం, ఇతర కార్య క్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్‌ స్క్రీనింగ్‌ను వీక్షించారు. సమ్మిట్‌ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధి కారులను ఆదేశించారు. 

అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్‌కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని సీఎం అధికారులకు సూచించారు. 

సీటింగ్, ఫైర్‌ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్‌ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి అంశంపైనా ముఖ్యమంత్రి అధికారులకు పలుసూచనలు చేశారు. ప్రాంగణం మొత్తాన్ని గంటకుపైగా కలియతిరిగారు. సీఎం వెంట ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కుందూరు జైవీర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

ప్రపంచ దేశాలతోనే తెలంగాణ పోటీ : పొంగులేటి
గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రపంచంలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుంది అని రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మిట్‌పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూప దని స్పష్టం చేశారు.  శనివారం ఆయన గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పరిశీలించారు. 

అనంతరం మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించామని చెప్పారు. గడచిన రెండు సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతోపాటు 2037 విజన్, 2047 విజన్‌ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్‌లో వివరించబోతున్నామని చెప్పారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)