Breaking News

మూసీ మాస్టర్ ప్లాన్‌.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Published on Wed, 08/27/2025 - 19:55

సాక్షి, హైదరాబాద్‌: మూసీ రివర్ డెవలప్‌మెంట్‌పై జూబ్లీహిల్స్ నివాసంలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, సిఎం సెక్రటరీ మాణిక్ రాజ్, ఏంఎఅండ్‌యూడీ సెక్రటరీ (హెచ్‌ఎండీఏ ఏరియా) ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎఫ్‌సీడీఏ కమిషనర్ కె. శశాంక, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి ఎండీ అశోక్ రెడ్డి, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, జెఎండీపీ గౌతమి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ మాస్టర్ ప్లాన్‌ను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధిపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్న సీఎం.. వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్నారు.

గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్‌.. అభివృద్ధి పర్యావరణహితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. మీరాలం చెరువు అభివృద్ధి, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రణాళికలను సీఎంకు అధికారులు వివరించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)