Breaking News

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి

Published on Fri, 05/23/2025 - 05:41

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ బన్సల్‌తోపాటు దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో వీరి పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్‌ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. 

అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్‌ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్‌ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. 

అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్, అహ్మద్‌ పటేల్‌ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్‌లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి, పవన్‌ బన్సల్‌ ఇంకా స్పందించలేదు. 

ఇదిలా ఉండగా,యంగ్‌ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్‌ నేత అరవింద్‌ విశ్వనాథ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్‌ పటేల్‌ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే.  

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)