Breaking News

ఇప్పట్లో లేనట్టేనా?.. కేబినెట్‌ విస్తరణపై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

Published on Fri, 02/07/2025 - 16:57

సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్‌లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్‌లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్‌ చెప్పారు.

ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!

‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్‌లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్  జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)