Breaking News

21న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌

Published on Mon, 12/18/2023 - 02:13

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో తొలిసారి సమావేశం కానున్నారు. ఈనెల 21న జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎస్‌ కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.  కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వ ఆలోచనా విధానాలను స్పష్టం చేయడంతో పాటు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేసేందుకు గాను ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సీఎంవో వర్గాలు చెపుతున్నాయి.

ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ధరణి పోర్టల్‌పై కీలక సమీక్ష ఉంటుందని, పలు భూ సంబంధిత అంశాలు, జీవో 58, 59 అమలు, ప్రజా వాణి కార్యక్రమం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు విస్తరించడం, గృహలక్ష్మి పథకం కింద ఇళ్లు కట్టు కునేందుకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాల ఖరారు, రైతు భరోసా అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, కౌలు రైతుల గుర్తింపు కోసం అనుసరించాల్సిన పద్ధతి.. తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా గృహలక్ష్మి పథకాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఉండి, ఇళ్లు లేని పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసే కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌ యోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండ్ల స్థలాల గుర్తింపు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల పంపిణీ కోసం మార్గదర్శకాల ఖరారుపై కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరించాలని, వారంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో కూడా నిర్వహించాలని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఏయే అధికారులు ప్రజావాణిని ఏయే వారాల్లో నిర్వహించాలనే దానిపై కూడా కలెక్టర్ల భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)