హాలీవుడ్‌కు వేదికవ్వాలి: సీఎం రేవంత్‌

Published on Sun, 06/15/2025 - 01:18

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సినీ పరిశ్రమ హాలీవుడ్‌కు హైదరాబాద్‌ వేదికగా మారాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశగా సినీ పెద్దలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్‌ అని అందరూ భావించేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. భారతీయ సినిమాల్లో తెలుగు సినిమా     ముందు వరుసలో ఉందని చెప్పారు. 

ఇకపై బాలీవుడ్‌కు హైదరాబాద్‌ వేదిక కానుందని పేర్కొన్నారు. శనివారం హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్‌ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చలనచిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి 1964లో నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 

ఆ అనవాయితీ ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. కొన్ని కారణాలవల్ల ఈ అవార్డుల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సినీ అవార్డుల ప్రదానంపై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత ఇవాళ గద్దర్‌ పేరుతో అవార్డులు అందిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.  

సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం  
‘భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ వేదికైంది.  రాష్ట్ర ప్రభుత్వం కొంత కఠినంగా కనిపించినా అది మీ అభివృద్ధి కోసమే. తెలుగు సినీ పరిశ్రమకు ఏం కావాలో నాకు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మరో 22 ఏళ్లు నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటా. నేను ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తా. 

ఐటీ పరిశ్రమలాగే సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం. 2047 విజన్‌ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ఒక అధ్యాయం కేటాయిస్తాం. నేను ఇటీవల నీతి అయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీకి తెలంగాణ విజన్‌ గురించి వెల్లడించాను. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుస్తాం. ఇప్పటివరకు నేను అనుకున్నవన్నీ సాధించాను. 

ఇది కూడా సాధ్యమవుతుందని 100 శాతం నమ్మకం ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు నాలుగో తరం కొనసాగుతోంది. గద్దరన్న అంటే ఒక విప్లవం.. ఒక వేగుచుక్క.. ఆయనే మాకు ఒక స్ఫూర్తిం. ఆ స్ఫూర్తితోనే మేం పోరాటాలు చేశాం. తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.  

గద్దర్‌ ఫౌండేషన్‌కు రూ.3 కోట్లు  
గద్దర్‌ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గద్దర్‌ ఫౌండేషన్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో గద్దర్‌ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్‌ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. ఇక ముందు గద్దర్‌ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్‌ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)