Breaking News

ఏఐ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం : సీఎం రేవంత్‌ రెడ్డి

Published on Thu, 09/05/2024 - 13:20

సాక్షి,హైదరాబాద్‌ : ఏఐ ఆధారిత రంగాల్లోని నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో రెండ్రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) సదస్సును రేవంత్‌ రెడ్డి ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో అడుగుపెట్టాం. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోంది. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏఐతో పాటు ఇతర టెక్నాలజీల్లో నిష్ణాతులైన నిపుణులకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా అందరికి అవకాశం ఇస్తున్నాం’ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.

రెండ్రోజుల ఏఐ సదస్సు
ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేథస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సును ఇవాళ, రేపు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు