Breaking News

గాంధీ సరోవర్‌కు ‘రక్షణ’ భూములివ్వండి

Published on Thu, 09/11/2025 - 06:12

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్‌’ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదలాయించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువల స్ఫూర్తిని చాటేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో సీఎం భేటీ అయ్యారు. 

98.20 ఎకరాలు కేటాయించండి 
మూసీ, ఈసా నదుల సంగమ స్థలిలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ‘గాంధీ సర్కిల్‌ ఆఫ్‌ యూనిటీ’నిర్మించ తలపెట్టామని, ఇందుకు గాను అక్కడున్న 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. గాంధీ సరోవర్‌ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్‌ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, మ్యూజియం, శాంతి విగ్రహం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 

ల్యాండ్‌ స్కేపింగ్, ఘాట్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే వినోద ప్రదేశాలను కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్‌ చెప్పారు. దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశంలో ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి, కేంద్ర ప్రాజెక్టులు, పథకాల సమన్వయకర్త డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)