Breaking News

LB Stadium: క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్‌

Published on Fri, 12/22/2023 - 21:00

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అందించే కానుకలను సీఎం రేవంత్‌ పంపిణీ చేశారు. 

ఇక, క్రిస్మస్‌ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో మతసామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. డిసెంబర్ నె‌ల మిరాకల్ నెల అని ముందే చెప్పా. నేను చెప్పిన మాట నిజమైంది. ఎర్రకోటపై మువ్వెనెల జెండా ఎగిరినప్పుడే దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మణిపూర్‌లో జరిగిన మారణ కాండ కళ్ల ముందే కనిపిస్తోంది. 

మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి శాంతి నెలకోల్పడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా ప్రధాని విమర్శించారు. మాకు బలమైన శక్తి వచ్చేలా బిషప్ లంతా ప్రార్థనలు చేయాలి. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులకు, చర్చిలో ప్రార్దనలు చేసే బిషప్‌లకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తాం. ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముళ్ళ కంచలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రారంభించాం’ అని వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్‌.. సజ్జనార్‌ కీలక ప్రకటన


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)