Breaking News

సీఎం రేవంత్‌ పేరిట డీప్‌ఫేక్‌.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Published on Fri, 07/18/2025 - 12:46

సాక్షి, హైదరాబాద్‌: రూ.21,000 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ.2 లక్షలు సంపాదిస్తారు. మీరు దీన్ని నమ్మి పెట్టుబడి పెట్టండి ’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నట్టుగా ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీలో ఒక న్యూస్‌ చానల్‌కు రేవంత్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వినియోగించి ఏఐతో ఒక డీప్‌ఫేక్‌ వీడియోను సృష్టించారు సైబర్‌ నేరగాళ్లు.

రేవంత్‌ రెడ్డి క్వాంటం ఏఐ అనే వెబ్‌సైట్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా కనిపించే నకిలీ ఏఐ–జనరేటెడ్‌ వీడియోను నమ్మవద్దని సీఎం కార్యాలయ అధికారులు సూచించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఫ్యాక్ట్‌ చెక్‌ తెలంగాణ సైతం ఈ వీడియో డీప్‌ఫేక్‌ అని, దాని నమ్మి మోసపోవద్దని సూచించింది. రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదు. అసలు క్వాంటం ఏఐని భారత ప్రభుత్వం ప్రారంభించలేదని, ప్రముఖుల వీడియోలను నకిలీవి సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. ఇలాంటి వీడియోల నుంచి సురక్షితంగా ఉండాలని సూచించారు.

ఇలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఊదరగొట్టే ప్రకటనలు నమ్మవద్దని, అటువంటి వెబ్‌సైట్‌లలో వ్యక్తిగత లేదా బ్యాంకింగ్‌ సమాచారాన్ని ఎప్పుడూ షేర్‌ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం పెట్టే ఏవైనా ఆర్థిక పథకాలను గురించి ధృవీకరించడానికి అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను గుర్తిస్తే వెంటనే  http://cybercrime.gov.in  కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)