తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్‌

Published on Mon, 06/10/2024 - 10:07

సాక్షి, హైదరాబాద్:​ కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, ఏపీ నుంచి రామ్మోహన్​ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్​, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్​ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్​లో ట్వీట్​ చేశారు

కాగా  మోదీ కేబినెట్​లో అమిత్​ షా, రాజ్‌నాథ్ సింగ్​, నిర్మల సీతారామన్​, నితిన్​ గడ్కరీ, జైశంకర్‌ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.

కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌లకు కేబినెట్‌ పదవులు దక్కగా.. బండి సంజయ్​, పెమ్మసాని చంద్రశేఖర్​, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్​లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)