మహారాష్ట్రకు గోదావరిపై స్పష్టత ఇవ్వాలి

Published on Mon, 02/13/2023 - 04:21

సాక్షి, హైదరాబాద్‌: మహారాష్ట్రకు గోదావరి నీటినిచ్చే విషయంపై సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలతో ఉత్తర తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వేరే రాష్ట్రాల వారు మాట్లాడితే కేసీఆర్‌ సహించేవారు కాదని, కానీ బీఆర్‌ఎస్‌ ఏర్పాటు తర్వాత ఆయన వైఖరి మారిందన్నారు. కేసీఆర్‌ మహారాష్ట్రలో మాట్లాడినప్పుడు అవసరమైతే ఎస్సారెస్పీ నుంచి, ఆ పైనుంచి నది నుంచి నీటిని ఎత్తిపోసుకునే వెసులుబాటు కనిపిస్తామని అన్నట్టు విన్నానని, వాస్తవంగా కేసీఆర్‌ చెప్పిందేమిటో ఆయనే స్పష్టత ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై ఈటల ప్రసంగించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కేసీఆర్‌ సమక్షంలో మాట్లాడటం ఈటలకు ఇదే మొదటిసారి కావడం విశేషం. కేంద్రం నుంచి మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని, అక్కడి నుంచి నిధులు వస్తాయని అంచనా వేసుకోవటం సరికాదని ఈట ల చెప్పారు. చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రావట్లేదని, లాభాల కోణంలో చూడకుండా ఆర్టీసీ బస్సులు పెంచి అన్ని గ్రామాలకు వచ్చేలా చూడా లని కోరారు. ఈటల చెప్పిన విషయాలను నోట్‌ చేసుకోవాలని సీఎం ఈ సందర్భంగా మంత్రులకు సూచించారు. కాగా, ఈటల మాట్లాడుతుండగానే సమయం మించి పోయిందంటూ స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి సీఎం మాట్లాడాల్సిందిగా సూచించారు.    

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)