MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..
Breaking News
యాదాద్రిలో సీఎం కేసీఆర్.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు
Published on Fri, 09/30/2022 - 15:21
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. బంగారు తాపడం కోసం వారి కుటుంబం తరపున కిలో 16 తులాల బంగారం స్వామి వారికి కానుకగా ఇచ్చారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షించారు.
శనివారం వరంగల్‌కు.. సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ వరంగల్‌లో నిర్మించిన ఓ ప్రైవేటు ఆస్పత్రిని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఆయన వరంగల్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించే అవకాశముంది. జాతీయ పార్టీ పేరు, ముహూర్తంపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. జాతీయ పార్టీపై దసరా రోజు అధికారిక ప్రకటన చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇదీ చదవండి: రూ.80 కోట్లతో కొనుగోలుకు టీఆర్‌ఎస్ నిర్ణయం
Tags : 1