Breaking News

‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్‌ ఆర్తనాదాలు

Published on Mon, 11/03/2025 - 14:46

సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్‌లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్‌ కాంట్రాక్ట్‌ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

	Chevella Bus Incident: కంకర మొత్తం బస్సులోకి వెళ్లడంతో కూరుకుపోయిన ప్రయాణికులు

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)