3 జిల్లాలకు రెడ్‌.. 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

Published on Wed, 10/29/2025 - 05:06

సాక్షి, హైదరాబాద్‌: మోంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం సాయంత్రం ఏపీలోని అంతర్వేదిపాలెం వద్ద మోంథా తీరాన్ని తాకింది. ఈ తుపాను ప్రభావం తెలంగాణపైనా ఉంటుందని వాతా­వరణ శాఖ చెప్పింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈమేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ జిల్లాల్లోని చాలాప్రాంతాల్లో భారీ వర్షాలు, అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. 

రాష్ట్రంలో మరో 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ జిల్లాలో తక్షణ సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదయ్యాయి. బుధవారం కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఎక్కడెక్కడ ఏ అలర్ట్‌? 
రెడ్‌ అలర్ట్‌: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం
ఆరెంజ్‌ అలర్ట్‌: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, 
ఎల్లో అలర్ట్‌: కుమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌

36 విమానాలు రద్దు
శంషాబాద్‌: మోంథా తుపాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి నుంచి హైదరాబాద్‌ విమానాశ్రయానికి మంగళవారం రాకపోకలు సాగించే 36 విమానాలు రద్దయినట్లు ఎయిర్‌పోర్టువర్గాలు వెల్లడించాయి. ఎయిరిండియా, ఇండిగో విమానాలు సర్వీసులను రద్దు చేసినట్లు ముందస్తు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. 

మూసీకి పెరుగుతున్న వరద
మణికొండ: హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు పైనుంచి వరద పెరుగుతోంది. భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జలాశయాల గేట్లు తెరచి మూసీనదికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. 

సాయంత్రానికి గండిపేటకు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండగా 2,732 క్యూసెక్కుల నీటిని మూసీకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌కు పైనుంచి 1,600 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 3,963 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)