బియ్యం.. మరింత ప్రియం

Published on Mon, 09/30/2024 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: బాస్మతీయేతర బియ్యం ఎగు­మ­తులపై నిషేధం ఎత్తివేతతో సన్నబియ్యం ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి. ప్రస్తుతం అధికంగా వినియోగించే సన్న బియ్యం రకాలైన సోనా మసూరి, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం, బీపీటీ రకాలు, తెలంగాణ సోనా వంటి మేలిమి బియ్యం ధరలు ఏకంగా కిలో రూ. 60 నుంచి రూ. 70కి చేరుకున్నాయి. బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ, కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) శుక్రవారమే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పారా బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం), బ్రౌన్‌ రైస్‌పై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యే సన్నరకాలు భారీ ఎత్తున విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశముంది. అమెరికాతో పాటు బంగ్లాదేశ్, యూరోప్‌ వంటి 140 దేశాలకు భారత్‌ నుంచి బియ్యం ఎగుమతులు పెరుగు­తాయి. ఈ ప్రభావం దేశీయ బియ్యం మార్కెట్‌పై పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

గత ఏడాది జూలైలో బియ్యంపై సర్కార్‌ ఆంక్షలు
2022–23లో ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గింది. అదే సమయంలో విదేశాల్లో బియ్యం డిమాండ్‌ పెరిగి, దేశీయంగా బియ్యం ధరలు భారీగా పెరిగే పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గత సంవత్సరం జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యం, నూకల బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పారా బాయిల్డ్‌ రైస్‌ (ఉప్పుడు బియ్యం)­, బ్రౌన్‌ రైస్‌లపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం విధించింది. భారత్‌ నుంచి బియ్యం ఎగుమతి ఆగిపోవడంతో థాయ్‌లాండ్, వియ­త్నాం, పాకిస్తాన్‌ల నుంచి ఎగుమతులు పెరిగాయి. అయితే భారత్‌లో ఉత్పత్తి అయిన బియ్యానికి డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా దేశీయ బియ్యం ఎగుమతులు పెరుగుతాయని భావిస్తున్నా­రు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)