Breaking News

మేడారంలో కేంద్రమంత్రుల పూజలు.. రాష్ట్ర మంత్రుల వినతి ఇదే..

Published on Thu, 01/29/2026 - 12:19

సాక్షి, మేడారం: మేడారం మహాజాతరలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. సమక్క నేడు వనం నుండి జనం మధ్యకు రానుంది. తల్లి రాక సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలు  మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు.. మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రమంత్రులు కూడా మేడారం జాతరలో పాల్గొన్నారు.

Sammakka Sarakka : Medaram Jatara 2026 HD Photos 5

మేడారం మహా జాతరలో కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారలమ్మని దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు. మరోవైపు.. రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పొంగులేటి, సీతక్క, లక్ష్మణ్ కూడా మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర మంత్రులు జుయల్ ఓరమ్, కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు వినతిపత్రం సమర్పించారు.

ఇదిలాఉండగా.. మేడారం జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. సారలమ్మను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా.. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా గద్దెల పైకి తీసుకొస్తారని తెలిసిందే. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, ఐదు వంశస్తులు, మేడారం గ్రామస్తులతో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

Sammakka Sarakka : Medaram Jatara 2026 HD Photos 8

సమ్మక్క రాక సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా డిప్యుటీ సీఎం భట్టి  మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పూజారులకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. స్థానిక మంత్రి సీతక్క అన్నీ తానై జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)