Breaking News

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై కేసు నమోదు..

Published on Sat, 03/11/2023 - 15:49

సాక్షి, హైదరాబాద్‌: కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

బండి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేశాయి. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడిన బండిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాగా.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండిపై తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. దీన్ని సుమోటాగా తీసుకుని నోటీసులు పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు కవిత హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆమెపై విమర్శలు గుప్పిస్తూ నోరుజారారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు.
చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)