Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా.. అరెస్టు

Published on Sun, 09/15/2024 - 12:11

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో నీట్ మెడికల్ కౌన్సిలింగ్ వెంటనే నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ విద్యార్థి సంఘం(బీఆర్‌ఎస్వీ) నేతలు డిమాండ్‌ చేశారు. ఆదివారం(సెప్టెంబర్‌ 15) బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముందు ధర్నా నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. 

మినిస్టర్‌ క్వార్టర్స్‌కు వెళ్లేందుకు యత్నంచిన మరికొందరు బీఆర్‌ఎస్వీ నేతలను బీఆర్‌ఎస్‌ కార్యాలయం తెలంగాణభవన్‌ వద్దే పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్వీ నేతలకు వాగ్వాదం జరిగింది. పోలీసులను నెట్టివేసి వెళ్లేందుకు బీఆర్‌ఎస్వీ నేతలు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. 

‘తెలంగాణ స్థానిక విద్యార్థులకే మెడికల్ సీట్లు కేటాయించాలి. ఇతర రాష్ట్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు అమ్ముకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నరసింహ కుట్ర చేస్తున్నారు. జీవో నెంబర్ 33 వల్ల తెలంగాణ స్థానిక విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణలో పుట్టిన ప్రతి విద్యార్థి తెలంగాణ  స్థానికుడే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33 పై సుప్రీంకోర్టులో వేసిన అప్పీలను ఉపసంహరించుకోవాలి’అని గెల్లు డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి.. ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు

 

 

 

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)