Breaking News

కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీలన్నీ అమలు

Published on Sun, 11/09/2025 - 01:11

సాక్షి, హైదరాబాద్‌: ‘ఒక్కసారి అవకాశమిస్తేనే నాశనం చేసిన., మళ్లీ అవకాశమిస్తే సర్వనాశనం చేస్తా’అంటున్న రేవంత్‌రెడ్డికి అవకాశమిస్తే మీ వేలితోనే మీ కన్ను పొడుచుకున్నట్లవుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్‌లో మాట్లాడుతూ మీ ఓటుతో కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు. 

ఈ నెల 14న మీ సత్తా చూపాలని, బీఆర్‌ఎస్‌ గెలుపుతో రాష్ట్రంలో కొత్త తుపాను రానుందని వ్యాఖ్యానించారు. గెలుపు అనే కత్తి­­ని మాచేతికిస్తే మీ తరపున యుద్ధం చేస్తామన్నారు. ‘పుట్టి­న బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు అందరినీ మోసం చేసిన కాంగ్రెస్‌కా.. లేక పేదల బతుకులు ఆగం చేస్తే గల్లాపట్టి గుంజికొడతాం అంటున్న బీఆర్‌ఎస్‌కా మీ ఓటు’ అని ప్రశ్నించారు. 

సర్వేల్లో ఓటమి అని తేలగానే అజహరుద్దీన్‌కు మంత్రి పదవి, సినీ కార్మికులకు వరాలు కురిపించడమే కాక ముఖ్యమంత్రితో సహ మంత్రులందరూ గల్లీగల్లీ తిరుగుతున్నారని, ఈ ఎన్నికల్లో వారిని ఓడిస్తేనే మీకిచ్చిన హామీలన్నీ అమలవుతాయని అన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తు­లం బంగారం ఇవ్వకపోగా మెడలో పుస్తెలు లాక్కుంటా­రని కేసీఆర్‌ అప్పుడే చెప్పారన్నారు. 

పార్టీ అభ్యర్థి మాగుంట సునీత మీద కుట్రలు చేస్తున్నారని, ఆమెకు అండగా నిలబడాలన్నారు. ప్రజలను బెదిరిస్తూ నకరాలు చేస్తున్న గూండాల పేర్లు రాసిపెట్టుకుంటామన్నారు. 500 రోజుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని, ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న వారి తోకలు కత్తిరిస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లో తోకలాడించే పోలీసులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్‌ షోలో పార్టీ నేతలు పల్లా రాజేశ్వరరెడ్డి, విష్ణు పాల్గొనగా, పెద్దసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)