Breaking News

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. బీఆర్‌ఎస్‌ కీలక నిర్ణయం

Published on Wed, 12/17/2025 - 17:49

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. అయితే, స్పీకర్‌ నిర్ణయాన్ని పిటిషన్‌ దాఖలు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. అరికపూడి గాంధీ,గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ తీర్పును వెలువరించారు. 

ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని, వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్‌ విచారణ చేపట్టారు. ఆ ఐదుగురు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారికి అనర్హత వేటు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ వరుస పరిణాలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పీకర్ తీర్పు ఇచ్చిన ఐదుమంది ఎమ్మెల్యేల కేసులో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. స్పీకర్ నిర్ణయంపై కేసీఆర్, కేటీఆర్‌తో పిటిషనర్లు వివరించినట్లు తెలుస్తోంది. 

స్పీకర్‌ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ స్పందించారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. స్పీకర్ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)