Breaking News

కోతలపైనే సర్కారు దృష్టి

Published on Sun, 01/19/2025 - 06:25

సాక్షి, హైదరాబాద్‌:  కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్‌ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివా రం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్‌తో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రేషన్‌ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్‌రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్‌ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు.  

ఆదాయ పరిమితి పెంచాలి.. 
‘పదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్‌కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వకుంటే బీఆర్‌ఎస్‌ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్‌ చేసిన మోసంతో ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.  

నెలలు గడిచినా వేతనాలేవీ..  
ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)