ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
బీఆర్ఎస్ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్లు!
Published on Sat, 07/18/2026 - 09:30
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతకు మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేళ్ల క్రితం సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎండగట్టేందుకు సమాయత్తమైంది. నిరుద్యోగ యువతతో కలిసి ధర్నాలు, ఆందోళనలకు సిద్దమైంది.
బీఆర్ఎస్ పార్టీ శనివారం ‘చలో సరూర్నగర్’ పేరిట యువ సంగ్రామ సభ నిర్వహించనున్నది. ఈ సదస్సుకు గులాబీ పార్టీ సర్వం సిద్ధం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్న ఈ సభను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. సుమారు 20వేల మంది తరలిరానున్న నేపథ్యంలో అనేక ఆటంకాలు, ఇబ్బందులను అధిగమించి చకచకా ఏర్పాట్లు చేసింది.
బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్ https://t.co/roxyHPPbHN pic.twitter.com/plf2dkrsgQ
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
మరోవైపు.. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలు చేస్తున్నట్టు గులాబీ నేతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసుల తనిఖీలు
నిరుద్యోగులు, యువకులు సభకు రాకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం https://t.co/lNODxhBULE pic.twitter.com/V71mY5cx9F— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026
Tags : 1