Breaking News

హరీష్‌రావుకు పితృవియోగం.. రాజకీయ ప్రముఖుల సంతాపం

Published on Tue, 10/28/2025 - 06:41

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈ వేకువజామున కన్నుమూశారు. దీంతో హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచారు.

 

కేసీఆర్‌ సంతాపం
 హైదరాబాద్‌లోని క్రిన్స్‌విల్లాస్‌లో హరీష్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి బీఆర్‌ఎస్‌ అధినేత..మాజీ సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. తన బావ సత్యనారాయణరావుతో (కేసీఆర్ 7వ సోదరి (అక్క) లక్ష్మి భర్త)తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

సీఎం రేవంత్‌ సంతాపం
హరీష్‌రావు తండ్రి సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఒక ప్రకటనలో హరీష్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సత్యనారాయణకు నివాళుల్పరించిన కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు

హరీష్‌ కుటుంబానికి కవిత సానుభూతి
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

హరీష్ రావు తండ్రి కన్నుమూత

మంచి వ్యక్తి: బండి సంజయ్‌
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు. సత్యనారాయణ చాలా మంచి వ్యక్తి. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనతో ఎంతో కాలంగా నాకు సాన్నిహిత్యముంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. హరీష్ రావు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని అమ్మ వారిని వేడుకుంటున్నా’ అని బండి సంజయ్‌ ఆ ప్రకటనలో తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)