Breaking News

సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలి

Published on Thu, 10/30/2025 - 04:20

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రచారంలో పాల్గొనకుండా నిషేధించడంతో పాటు, సుమోటోగా కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్‌రెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. 

సీఎం రేవంత్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సినీ కార్మికుల ఓట్లకోసం సన్మానాల పేరిట కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు అనంతరం గంగుల కమలాకర్‌ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఆధారాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశాం. 

కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌ను తొలగించడంతో పాటు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని కోరాం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఇచి్చన ఫిర్యాదులో కోరాం. తనకు అడ్డువస్తే చంపేస్తానని నవీన్‌ యాదవ్‌ బెదిరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’అని గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కాగా, ఇదే అంశంపై బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ బృందం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)