Breaking News

సాయిచంద్, జగదీశ్‌ కుటుంబాలకు కోటిన్నర చొప్పున సాయం.. కేటీఆర్‌ ప్రకటన

Published on Sat, 07/08/2023 - 12:39

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల మృతి చెందిన భారత్‌ రాష్ట్ర సమితి యువ నాయకుల కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారకరామారావు వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. ములుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్, తెలంగాణ ఉద్యమంలో గాయకుడిగా ప్రజ­ల్లో చైతన్యం రగిల్చిన రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వేద సాయిచంద్‌ ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.


                                               సాయిచంద్‌ (ఫైల్‌)

ఈ యువ నాయకుల కుటుంబాలకు కోటిన్నర రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒకనెల వేతనంతో ఈ సాయం అందించనున్నట్లు శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాకు చెప్పారు. వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, భార్యకు కోటి రూపాయల లెక్కన అందిస్తామని పేర్కొన్నారు.


                                                   జగదీశ్‌ (ఫైల్‌)

కాగా, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉంటూ వేదసాయిచంద్‌ ఆకస్మికంగా మరణించడంతో ఆయన భార్య వేద రజనికి అదే సంస్థ చైర్మన్‌ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని కేటీఆర్‌ చెప్పారు. ఈ మేరకు ప్రభు­త్వం ఉత్తర్వు­లు జారీ చేసింది.  సాయి­చంద్‌ కుటుం­బాన్ని శుక్ర­వారం ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్, బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ పరామర్శించారు. రజనికి  రూ.1.5 కోట్ల  సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)