Breaking News

బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఉద్రిక్తత

Published on Wed, 04/02/2025 - 06:12

సాక్షి,హైదరాబాద్‌/హిమాయత్‌నగర్‌: హెచ్‌సీయూ భూము లను పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళతారన్న ముందస్తు సమాచార నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బీజేఎల్‌పీ నేత మహేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో హౌస్‌అరెస్ట్‌ చేశారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను పోలీసులు చుట్టుముట్టి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసి సమీప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

రాబోయే రోజుల్లో ఓయూ, కేయూ భూములు కూడా అమ్ముతారేమో: ఏలేటి 
ఇప్పుడు హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ, రాబోయే రోజుల్లో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల భూములను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ‘తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. భూములు అమ్మితే కానీ ప్రభుత్వం నడవని పరిస్థితి. రియల్‌ ఎస్టేట్‌ దందా చేయడానికే ఈ ప్రభుత్వం ఉందా’అని ఏలేటి ప్రశ్నించారు. మంగళవారం హెచ్‌సీయూ సందర్శనకు వెళుతున్న తన హౌస్‌అరెస్ట్, బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్‌ను ఆయన ఖండించారు. 

వెంటనే అఖిలపక్ష బృందాన్ని హెచ్‌సీయూకు తీసుకెళ్లి చూపించాలని డిమాండ్‌ చేశారు. ‘త్వరలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తాం. వర్సిటీల భూముల జోలికి వెళితే సహించేది లేదు. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం’అని హెచ్చరించారు. కాంగ్రెస్‌ మిత్రపక్ష నేతలైన ప్రొఫెసర్‌ కోదండరామ్, కూనంనేని సాంబశివరావులకు హెచ్‌సీయూ భూముల వివాదం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

వేలాన్ని వెనక్కి తీసుకోవాలి: పాయల్‌ శంకర్‌ 
హెచ్‌సీయూ భూము ల వేలాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసు కోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్‌ శంకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఎమ్మె ల్యే ధన్‌పాల్‌ సూర్యనా రాయణ గుప్తాతో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు ‘ధరణి పేరుతో నాడు కేసీఆర్‌ దోపిడీ చేశారు. భూమాత పేరుతో నేడు కాంగ్రెస్‌ భూ దందా చేయడానికి ప్రయ త్నిస్తోంది’అని ఆరోపించారు. హెచ్‌సీయూ భూములపై వాస్తవ పరిస్థితు లకు తెలుసుకుందామని వెళుతుంటే పోలీసులు తమను నిర్బంధించారని, అణచివేత ప్రజాపాలన అవుతుందా అని పాయల్‌శంకర్‌ ప్రశ్నించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)