Breaking News

మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’

Published on Sat, 04/29/2023 - 13:44

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో నగరంలోని కళాసిగూడలో పాల ప్యాకెట్‌ కోసం చిన్నారి మౌనిక మ్యాన్‌హోల్‌లో పడిపోయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇదే క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

మరోవైపు.. కళాసిగూడ ఘటనలో​ జీహెచ్‌ఎంసీ చర్యలకు సిద్దమైంది. వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌పై సస్పెన్షన్‌ విధించింది. ఇక, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

ఇక, చిన్నారి మృతిపై బీజేపీ నేతలు స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మౌనిక మృతికి జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమే కారణం. కాంట్రాక్టర్లకు జీహెచ్‌ఎంసీ సరిగా బిల్లులు ఇవ్వడం లేదు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రోడ్లు తవ్వినప్పుడు కనీసం జాగ్రత్తలు పాటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు’ అంటూ విమర్శలు గుప్పించారు  

మరోవైపు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ డ్రైనేజీ వ్యవస్థ పైన మెరుగు.. లోపల మురుగు. బయటకు వెళ్లినవారు ఇంటికొస్తారనే నమ్మకం లేదు. చిన్నారి ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: Hyderabad Rains: మ్యాన్‌హోల్‌లో పడి చిన్నారి మృతి

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)