Breaking News

Telangana: మద్యం ప్రియులకు షాక్‌.. ఇక బీర్లు దొరకడం కష్టమే..!

Published on Thu, 04/04/2024 - 11:22

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): వేసవి కాలంలో చల్లని బీరు తాగాలని ఆశించే మద్యంప్రియులకు బీర్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇ ప్పటికే హాజీపూర్‌ మండలం గుడిపేటలోని మ ద్యం డిపోకు బీర్ల సరఫరా చాలావరకు నిలిచి పోయింది. వచ్చిన నిల్వలను డిపో పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లకు రేషియో పద్ధతిన సరఫరా చేస్తోంది. బీర్లకు కొరత ఏర్పడగా.. కొ ద్ది రోజుల్లో తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. గ తంలో పలు కంపెనీలు ప్రభుత్వ లిక్కర్‌ గోదా ములకు సరఫరా చేసిన బీరు నిల్వలకు బకా యిల చెల్లింపులో జాప్యమే కొరతకు కారణమని తెలుస్తోంది.

గుడిపేట లిక్కర్‌ డిపో పరిధిలో 135 మద్యం దుకాణాలు, 28వరకు బార్లు ఉన్నా యి. వేసవిలో పెద్దయెత్తున బీర్ల అమ్మకాలు సాగుతాయి. గత ఏడాది మార్చిలో రెండు లక్షల వరకు బీరు కేసుల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో 1.80లక్షల వరకు బీరు కేసులు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఏడాది బీరు కేసులు మద్యం దుకాణాల డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా జరిగి డిపోలో లక్షల కేసుల నిల్వలు ఉండేవి. ఇప్పుడు బీరు కేసులు వచ్చినవి వచ్చినట్లు విక్రయిస్తుండగా.. డిపోలో నిల్వలు ఉండడం లేదు. ఈ లెక్కన డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేదని తెలుస్తోంది.

బిల్లులు పెండింగ్‌లో..
లిక్కర్‌ తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వం వివిధ బ్రాండ్లకు సంబంధించి బీర్లు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం డిపోలకు సరఫరా చేస్తోంది. అక్కడి నుంచి రిటైల్‌ దుకాణాలకు సరఫరా జరుగుతుంది. లిక్కర్‌ తయారీ కంపెనీలు సరఫరా చేసిన మద్యం బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో కొన్ని డిస్టిలరీస్‌, బ్రేవరేజేస్‌లు మద్యం ఉత్పత్తి తగ్గించడంతోపాటు బీరు నిల్వల సరఫరా చాలా వరకు తగ్గించేశాయి. వేసవిలో మార్చి నుంచి మే వరకు దాదాపు రూ.2కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతాయి. ఒక్కో మద్యం దుకాణానికి రోజుకు సుమారుగా 50 బీరు కేసుల వరకు విక్రయాలు జరిగేవి. కానీ ఈ వేసవిలో 30 బీరు కేసుల వరకు కూడా సరఫరా చేయడం లేదని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో బీర్ల కొరత తీవ్రం కానుంది.

డిపో పరిసరాలు వెల వెల
గుడిపేట మద్యం డిపో పరిసరాలు నిత్యం కళకళలాడుతూ కనిపించేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా వెల వెలబోతున్నాయి. పలు మద్యం కంపెనీలు బీరు నిల్వల సరఫరా తగ్గించడంతో లారీలు, ఇతర వాహనాల రాకపోకలు తగ్గాయి. మొన్నటి వరకు రోజుకు 20 వాహనాలకు పైగా మద్యం నిల్వలతో వచ్చిన సందర్భాలు ఉండగా ఇప్పుడు 10 వాహనాలు కూడా డిపోకు రావడం లేదు. డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ను సంప్రదించగా.. డిపోకు వచ్చిన బీరు నిల్వలను అన్ని రిటైల్‌ మద్యం దుకాణాలకు రేషియో పద్ధతిన సమానంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)