Breaking News

BC Reservations: ‘మా వాదనలు పూర్తిగా వినలేదు..’

Published on Tue, 10/14/2025 - 10:18

సాక్షి, ఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాలు చేసింది. బీసీలకు 42% శాతం రిజర్వేషన్ల జీవో పై హైకోర్టు స్టే తొలగించాలని అందులో కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం అర్ధరాత్రి పిటీషన్ దాఖలు చేసినట్లు సమాచారం. అందులో ఏముందంటే.. 

50% రిజర్వేషన్లు పరిమితి నియమమే తప్ప రాజ్యాంగ పరమైనది కాదని పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9పై స్టే విధించిందని తెలిపింది. ఓబీసీ సమగ్ర వివరాలను కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయన తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం రిజర్వేషన్లు కేటాయించామని పిటిషన్ లో పేర్కొంది ప్రభుత్వం. 

వీలైనంత త్వరగా విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ శనివారం నుంచి పదిరోజుల పాటు సుప్రీం కోర్టుకు సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారాంతం లోపే ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు కావడంతో విచారణ జరిగితే వాటిని కూడా కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)