Breaking News

బీసీ సంక్షేమ బడ్జెట్‌ పెంచాలి 

Published on Fri, 02/17/2023 - 01:08

పంజగుట్ట (హైదరాబాద్‌): రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేటాయించిన రూ.6,229 కోట్లు ఏమాత్రం సరిపోవని, దాన్ని రూ.20 వేల కోట్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వందలాది మంది విద్యార్థులు, యువకులతో కలిసి గురువారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖమంత్రి కార్యాలయం ముందు నిరసన తెలిపారు.

సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేష్‌ల నాయకత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.9 లక్షల కోట్లు అయితే.. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమానికి రూ.6,229 కోట్లు కేటాయిస్తే ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. బడ్జెట్‌లో కొత్త పథకాలేవీ లేవని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపకార వేతనాలు, మెస్‌చార్జీల పెంపు ప్రస్తావనే లేదని, కాలేజీ కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీకి బడ్జెట్‌ కేటాయింపుల్లేవని విమర్శించారు. ఈ విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తా మన్న హామీకి బడ్జెట్‌ లేదని కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)